శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (09:47 IST)

టార్గెట్ పూర్తి చేయలేదనీ కుక్కల్లా నడిపించారు.. ఎక్కడ? (Video)

కొన్ని కార్పొరేట్ కంపెనీలు టార్గెట్లు పూర్తి చేయని ఉద్యోగులకు చిత్ర విచిత్ర శిక్షలను విధిస్తున్నారు. తాజాగా చైనాలోని ఓ కంపెనీ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులు టార్గెట్లు పూర్తి చేయని కారణంగా కుక్కల్లా నడిపించారు. అదీకూడా పట్టపగలు, అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై ఈ శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చైనాలోని షెండోంగ్ ప్రాంతంలో ఓ కార్పొరేట్ కంపెనీ ఉంది. ఇందులో పని చేసే ఉద్యోగులకు రోజువారీ టార్గెట్లను నిర్ధేశిస్తుంది. ఈ టార్గెట్లు పూర్తి చేయని వారికి విచిత్రమైన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా కొందరు సిబ్బంది తమ టార్గెట్లను పూర్తి చేయలేకపోతారు. దీనికి వీరికి శిక్షను విధించింది. 
 
ఈ వీడియోలో ఒక వ్యక్తి ముందు వెళుతున్నాడు. అతను కంపెనీకి సంబంధించిన జెండా పట్టుకున్నాడు. అతనిని అనుసరిస్తూ కొంతమంది నేలకు వంగి (కుక్క మాదిరిగా) నడుస్తున్నారు. దీనిని పోలీసులు గమనించినప్పటికీ అడ్డుకోకపోవడం విశేషం. 
 
ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులను ఇంతలా అవమానపరిచిన కంపెనీని తక్షణమే మూసివేయించాలని డిమాండ్ చేశారు. గతంలో చైనాలోని పలు కంపెనీలు టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగుల చేత మూత్రం తాగించడం, బెల్టుతో కొట్టడం, తలను టాయిలెట్ బౌల్‌లో పెట్టడం, మురుగు నీటిని తాగించడంలాంటి హీనమైన పనులు చేయించిన ఉదంతాలు వెలుగు చూసిన విషయం తెల్సిందే.