గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (12:12 IST)

ఎరుపు రంగు కనిపించిందో.. అత్యాచారం చేసి.. మర్మాంగాన్ని..?

ఎరుపు రంగు దుస్తులేసుకునే అమ్మాయి కనిపించిందో అతడు అత్యాచారానికి పాల్పడుతాడు. అంతటితో ఆగకుండా హత్య కూడా చేసేస్తాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది మహిళలను దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సీరియల్ రేపిస్ట్ కిల్లర్‌కు చైనా కోర్టు మరణశిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని బెయినీలో ఓ కిరాణా కొట్టు నడిపిస్తున్న గావో అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. కానీ గావోకు రెడ్ డ్రెస్ వేసుకుని అబ్బాయిలు కానీ మహిళలు కానీ కనిపిస్తే పిచ్చెక్కిపోతుంది. వారిని వెంబడిస్తాడు. వాళ్ల ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడతాడు. అంతటితో ఆగకుండా మహిళల మర్మాంగాలను అతికిరాతకంగా తెగ్గోసేవాడు. 
 
ఇలా 1988 నుంచి 2002 మధ్య దాదాపు పది మంది మహిళలను రేప్ చేసి హత్య చేశాడు. వీరిలో ఎనిమిదేళ్ల బాలిక కూడా వుంది. ఈ కేసును చేధించలేక పోలీసులు చేతులెత్తేశారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత ఓ చిన్న కేసులో గావో చిక్కుకున్నాడు. గత ఏడాది మార్చిలో గావో చెంగ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడిని దోషిగా నిర్ధారించడంతో అతనికి మరణశిక్ష పడింది.