మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (19:20 IST)

విద్యారుణాలు కావాలా? అయితే నగ్నంగా దిగిన సెల్ఫీలు ఇవ్వండి..

చైనీస్ ఈ-కామర్స్ పేరిట ఏర్పడిన ఓ స్టార్టప్ సంస్థ దందా బహిర్గతమైంది. అమ్మాయిలు నగ్నంగా దిగిన సెల్ఫీలను హామీగా తీసుకుంటున్న ఈ సంస్థ.. విద్యార్థినిలకు విద్యారుణాలను ఇస్తుంది. ఈ సంస్థకు చెందిన భారీ స్కామ్ ప్రస్తుతం చైనాలో బట్టబయలైంది.


చదువుకునేందుకు డబ్బులు లేకపోయినా.. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని.. ఎంచక్కా చదువుకుని ఉద్యోగం వచ్చాక ఆ రుణాన్ని తిరిగిచ్చేద్దాం అనుకున్న యువతులకు ఆ సంస్థ చుక్కలు చూపించింది. 
 
డబ్బు లేదనే బలహీనతను ఆసరాగా తీసుకుని వారి నుంచి న్యూడ్ ఫోటోలను స్వీకరించి, రుణాలు ఇచ్చింది. భవిష్యత్తులో వారు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోతే.. ఆ న్యూడ్ సెల్ఫీలను బయటపెడతామని ఆ సంస్థ హెచ్చరించేది.

ఈ సంస్థ పన్నిన వలలో ఎంతోమంది అమ్మాయిలు చిక్కుకున్నారని.. భారీ వడ్డీలకు అప్పులు తీసుకున్నారని.. ఇందుకోసం తమ నగ్న దృశ్యాలను తామే వారికి అందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో చైనా ఆర్థిక రంగానికి చెందిన అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.