శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జూన్ 2017 (12:14 IST)

కుమార్తె బతకదని.. పొలంలోనే గుంత తవ్వాడు.. రోజూ ఆ గుంతలో పడుకోబెడుతూ..?

కుమార్తె చనిపోతుందని తెలిసి.. ఆ తండ్రి కుమిలిపోయాడు. కుమార్తె ప్రాణాంత వ్యాధితో బాధపడుతుందని తెలిసి.. సంపాదించిన మొత్తాన్ని ధారపోశాడు. అయినా బిడ్డను బతికించలేదని వైద్యులు చెప్పారు. దీంతో చేసేది లేక కు

కుమార్తె చనిపోతుందని తెలిసి.. ఆ తండ్రి కుమిలిపోయాడు. కుమార్తె ప్రాణాంత వ్యాధితో బాధపడుతుందని తెలిసి.. సంపాదించిన మొత్తాన్ని ధారపోశాడు. అయినా బిడ్డను బతికించలేదని వైద్యులు చెప్పారు. దీంతో చేసేది లేక కుమార్తె కోసం పొలంలోనే పూడ్చిపెట్టేందుకు గుంత తవ్వాడు. పాపను ప్రతిరోజూ సాయంత్రం ఆడిస్తూ, ఆ గుంతలో కాసేపు పడుకోబెడుతున్నాడు. పాపతోపాటు తాను కూడా అందులోనే పడుకుంటున్నాడు. 
 
ఇలా చేయడం ద్వారా పాపకి ఇప్పటి నుంచే ఆ గుంతలో పడుకోవడం అలవాటవుతుందంటున్నాడు.. ఆ తండ్రి. తండ్రిగా ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నానని సమాధానం చెబుతున్నాడు. ఇదంతా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. 
 
సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన లియోంగ్ అనే రైతుకి రెండేళ్ల పాప వుంది. ఆమె పుట్టుక నుంచీ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. చికిత్స చేసిన వైద్యులు కూడా పాప ఇక బతికేది కొన్ని రోజులేనని తేల్చిచెప్పారు.