శిథిలాల కింద చిక్కుకున్న యజమాని.. ఆరాటపడిన శునకం
టర్కీలోని ఇజ్‌మిర్ నగరంలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంపంలో బహుళ అంతస్థులు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఇజ్‌మిర్ నగరంలో భూకంప ధాటికి కూలిన ఓ భవనం వద్ద హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది.
శిథిలాల కింద చిక్కుకున్న తన యజమాని కోసం ఓ శునకం ఆరాట పడుతోంది. నోరులేని ఆ మూగ జీవి యజమాని ప్రాణాల కోసం ఆరాటపడుతున్న దృశ్యాలు అందర్నీ కలిచివేస్తోంది. ఆ శునకం వెక్కివెక్కి ఏడ్చుతోంది.
అటు ఇటు తిరుగుతూ.. యజమాని చేతిని చూస్తూ తన ఆవేదనను వెలిబుచ్చుతోంది. అక్కడ్నుంచి కదలకుండా విశ్వాసంతో అక్కడే ఉండిపోయింది ఆ శునకం. శుక్రవారం సంభవించిన ఈ భారీ భూకంపం ఇజ్‌మిర్ నగరానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.