మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (07:39 IST)

మునుగుతున్న జింకను కాపాడింది. ఒకే.. సపర్యలు కూడా చేస్తే.. దాన్ని ఏమని పిలవాలి?

ప్రమాదంలో ఎవరైనా ఉంటే కాపాడటానికి వెనకా ముందూ ఆలోచించే నైజం మనిషిది కాగా, విశ్వాసంలో ప్రపంచ స్థాయి బ్రాండ్ విలువ గల శునకం తన కళ్ల ముందు మునిగిపోతున్న జింకను కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయకపోవజడం చూసి సోషల్ మీడియాలో దానికి నిరాజనాలర్పిస్తున్నారు.

దైవం మానవరూపంలో.. అవతరించెనే ఈ వేళా అని  అని తెలుగులో ఒక ప్రముఖ భక్తిగీతం ఉంది. దేవుడిపై నమ్మకం ఉన్నవారు దాన్ని కాస్త మార్చి దైవం శునక రూపంలో కూడా అవతరించాడని పాడుకోవచ్చు కూడా. ప్రమాదంలో ఎవరైనా ఉంటే కాపాడటానికి వెనకా ముందూ ఆలోచించే నైజం మనిషిది కాగా, విశ్వాసంలో ప్రపంచ స్థాయి బ్రాండ్ విలువ గల శునకం తన కళ్ల ముందు మునిగిపోతున్న జింకను కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయకపోవజడం చూసి సోషల్ మీడియాలో దానికి నిరాజనాలర్పిస్తున్నారు. 
 
విషయంలోకి వస్తే  న్యూయార్క్‌కి చెందిన మార్క్‌ ఫ్రీలీ అనే వ్యక్తి తన పెంపుడు శునకంతో కలిసి బీచ్‌లో నడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ పెంపుడు శునకం ఒక్కసారిగా నీటిలోకి దూకింది. ఎందుకలా దూకిందో ఫ్రీలీకి కాసేపు అర్థం కాలేదు. అయితే నీటిలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ జింకను కాపాడేందుకు ఆ శునకం నీటిలో దూకిందని గ్రహించాడు. 
 
వెంటనే ఆ శునకం జింక పిల్లలను కాపాడే ఘటనను వీడియో తీశాడు. జింక పిల్ల మెడ భాగాన్ని ఆ శునకం నోటితో పట్టుకుని నెమ్మదిగా ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతేకాదు.. జింక పిల్లకు కొన్ని సపర్యలు కూడా చేసింది. ఈలోపు ఫ్రీలీ జంతు సంరక్షణ విభాగానికి సమాచారమిచ్చి జింకను ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ జింక పిల్ల కోలుకుంటోంది.  అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.