గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (06:31 IST)

అమెరికా మార్కెట్లో డోనాల్డ్ ట్రంప్ చెప్పులు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్‌లోకి చెప్పులు వచ్చాయి. అక్షరాలా ఆయన అన్నమాటల్నే చెప్పులపై ప్రింట్ చేసిమరీ అమ్ముతోంది ఓ అమెరికన్ కంపెనీ. ట్విట్టర్‌లో యమా చురుకుగా ఉండే ట్రంప్… తన ట్వ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్‌లోకి చెప్పులు వచ్చాయి. అక్షరాలా ఆయన అన్నమాటల్నే చెప్పులపై ప్రింట్ చేసిమరీ అమ్ముతోంది ఓ అమెరికన్ కంపెనీ. ట్విట్టర్‌లో యమా చురుకుగా ఉండే ట్రంప్… తన ట్వీట్‌లకు పరస్పర విరుద్ధమైన ట్వీట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈయన అధ్యక్షుడు కాకముందు.. అయిన తర్వాత ఆయన చేసిన ట్వీట్లు విమర్శలకు దారితీస్తున్నాయి. 
 
వాటి ఆధారంగా ఫ్లిప్ ప్లాప్స్‌ను రూపొందిస్తోంది ప్రెసిడెంట్ ఫ్లిప్ ప్లాప్స్ కంపెనీ. వివిధ సందర్భాల్లో ట్రంప్ చేసిన ట్వీట్ల ఆధారంగా సిరియా ఎడిషన్, ఎలక్ట్రోరల్ కాలేజ్ ఎడిషన్, సోర్స్ ఎడిషన్ అంటూ మూడు రకాల చెప్పులు తయారు చేసింది. ఒక్కో జత ధర 27 డాలర్లు… మన కరెన్సీలో 1794 రూపాయలుగా ప్రకటించింది. వీటిపై వచ్చే ఆదాయంలో 10 శాతం నిధులను అమెరికన్ సివిల్ లిబరిటీస్ యూనియన్‌కి, ట్రంప్ విధానాలను వ్యతిరేకించే వారికి ఇవ్వనుంది.
 
సిరియాపై యుద్ధం అంశంపై, అమెరికా ఎలక్ట్రోరల్ కాలేజ్ విషయంలో పరస్పర విరుద్ధ ట్వీట్లు చేశారు ట్రంప్. వాటినే చెప్పులపై ప్రింట్ చేసింది. ఈ చెప్పులతో నడిస్తే.. అడుగు తీసి వేసేలోపే మాట వెనక్కు తీసుకుంటారు అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ఎరుపు, తెలుపు రంగులతో కలిపి రూపొందించిన ఈ చెప్పులు ట్రంప్ మాటల్లోని వైరుధ్యానికి ప్రతీక అంటోంది ఆ సంస్థ.