శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (09:03 IST)

ఉత్తరకొరియా రెచ్చిపోతే అంతే.. చైనాను నమ్మితే నష్టపోయేది?: ట్రంప్

ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుమ్మెత్తిపోశారు. ఆ దేశం ఓ పనికి మాలిన దేశమని ఫైర్ అన్నారు. ఉత్తర కొరియా చర్చల ద్వారా దారికొస్తుందని తాము కూడా ముందు ఆశించామని.. అయితే ప్రస్తుత పరిస్థి

ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుమ్మెత్తిపోశారు. ఆ దేశం ఓ పనికి మాలిన దేశమని ఫైర్ అన్నారు. ఉత్తర కొరియా చర్చల ద్వారా దారికొస్తుందని తాము కూడా ముందు ఆశించామని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పేశారు.

ప్రపంచ దేశాలన్నీ అణు క్షిపణుల ప్రయోగం వద్దని ఎంతగా చెప్తున్నా.. కిమ్ వినే పరిస్థితుల్లో లేరన్నారు. అంతకంటే ఆ నాయకుడు చేయగలిగింది ఏమి లేదని ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. 
 
ఉత్తరకొరియా మరింతగా రెచ్చిపోతే చేయాల్సిన పని చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేగాకుండా.. ఉత్తరకొరియాను చైనా ఉసిగొల్పడంతో కొంతవరకు చైనా విజయం సాధించినట్లు కనిపిస్తుందని తెలిపారు.

కానీ అది నిజమైన విజయం మాత్రం కాదని.. నిజానికి చైనా తన దేశ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటుందని చైనా నమ్మి ఉత్తరకొరియా రెచ్చిపోతే నష్టపోయేది ఉత్తరకొరియానేనని ట్రంప్ హెచ్చరించారు.