ట్రంప్ కూతురు ఇవాంకాపై ఉగ్రవాదుల కన్ను.. జాగింగ్ సమయంలోనూ భద్రత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భద్రత ప్రమాదంలో పడిందా? ఆమె చుట్టూ ఏర్పడుతున్న భద్రతా వలయం దీన్నే నిరూపిస్తోందా.. జాగింగ్‌కు పోవాలన్నా సీక్రెట్ ఎజెంట్స్ వెనుకంటి వెన్నాడాల్సిన పరిస్థితులు వచ్చేశాయా.. బాల్యంలో బోర్డింగ్ స్కూల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భద్రత ప్రమాదంలో పడిందా? ఆమె చుట్టూ ఏర్పడుతున్న భద్రతా వలయం దీన్నే నిరూపిస్తోందా.. జాగింగ్‌కు పోవాలన్నా సీక్రెట్ ఎజెంట్స్ వెనుకంటి వెన్నాడాల్సిన పరిస్థితులు వచ్చేశాయా.. బాల్యంలో బోర్డింగ్ స్కూల్ క్రమశిక్షణను కూడా బందీఖానాలాగా భావించి స్వేచ్ఛను కోల్పోయినట్లు ఫీలయిన ఇవాంకా ఇప్పుడు భద్రతా వలయం అనే బందిఖానాలో కూరుకుపోతూ మళ్లీ స్వేచ్ఛను కోల్పోతున్నారా. అవును నిజమే అంటున్నాయి అమెరికన్ పత్రికలు. జాగింగ్‌కి వెళ్లి, ఇంటికి క్షేమంగా తిరిగి రావడాన్ని కూడా ఏరోజుకారోజు ఒక పెద్ద విజయంగా పరిణమించే పరిస్థితులు ఇవాంక చుట్టూ క్రమక్రమంగా ఒక అభద్రతా వలయంలా ఏర్పడబోతున్నాయి!
ఏప్రిల్ 6న సిరియాపై అమెరికా క్షిపణిదాడులు జరిపాక ఆ ప్రమాదం మరింత ఎక్కువయింది. ట్రంప్ కుమార్తె ప్రోద్బలం వల్లనే ఈ దాడి జరిగిందన్న వార్తలు రావడమే ఇందుకు కారణం. సిరియాలో విషరసాయనాల ప్రయోగం ధాటికి వందమంది పిల్లలు బాధితులుగా మారిన సన్నివేశాన్ని టీవీల్లో చూసి ముగ్గురు పిల్లల తల్లి ఇవాంకా తట్టుకోలేక పోయారని వార్తలొచ్చాయి. ఈ ఘాతుకానికి బదులు తీర్చలేమా నాన్నా అంటూ ఇవాంకా ఫైర్ అయిన తర్వాతే ట్రంప్ సిరియా విమాన స్థావరంపై క్షిపణి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల వైట్ హౌస్‌కు వచ్చినప్పుడు ఇవాంక అతడిని కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయిన దృశ్యాన్ని యావత్ ప్రపంచ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అయితే ప్రపంచ దేశాలు మాత్రం ఆమెను అమెరికా అధ్యక్షుడికి నిరంతరం అందుబాటులో ఉండే ‘మిస్టీరియస్ బ్లాక్ బ్రీఫ్‌కేస్’ను చూసినట్టుగా భయం భయంగా వీక్షిస్తున్నాయి. ఎక్కడి నుంచైనా, ఏ క్షణంలోనైనా, ఏ దేశంపై మీదికైనా బాంబు వేయమని ఆదేశించే సాంకేతిక వ్యవస్థ ఆ బ్రీఫ్‌కేస్‌లో ఉంది! ట్రంప్ తన పుత్రికపై ఉన్న వాత్సల్యంతో బాంబు లాంటి అమెరికాను ఆడుకోడానికి ఆమె చేతికి ఇచ్చేశారని తక్కిన అగ్రరాజ్యాలు ఇప్పుడు కలవర పడుతున్నాయి.
అయితే ఇవాంక వైట్‌హౌస్‌లో ఉన్నంత వరకే అమెరికా గానీ, మిగతా దేశాలు గానీ ట్రంప్ చేతుల్లో సురక్షితంగా ఉంటాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఊహించడం గమనార్హం.. అయితే ఇది కాలం వల్ల రుజువయ్యే ఊహ కాదు. కాలానికే ఇవాంక పెట్టే పరీక్ష. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా ప్రథమ మహిళ హోదాలో ఉన్న మెలానియా కంటే ఇవాంకకే ‘ప్రథమ పుత్రిక’గా ఎక్కువ ప్రాముఖ్యం లభిస్తోంది!
రాజకీయం అంటే కూడా ఏమిటో తెలియకముందు అంటే హిల్లరీ క్లింటన్ 2007లో ఒబామాపై పోటీగా అధ్యక్ష పదవికి నిలబడినప్పుడు, హిల్లరీ ఎన్నికల ప్రచారానికి ఇవాంక వెయ్యి డాలర్ల విరాళం ఇచ్చారు! సుమారు 65 వేల రూపాయలు. ఇవాంక అప్పుడు అమెరికన్ మోడలింగ్ ప్రపంచాన్ని దాదాపుగా ఏలుతున్నారు. ఫోర్బ్స్, గోల్ఫ్ మ్యాగజీన్, అవెన్యూ, ఎల్, మెక్సికో, టాప్ చాయిస్ మ్యాగజీన్.. ఏ కవర్‌పై చూసినా ఇవాంకానే! ‘లవ్ ఎఫ్.ఎం.డి.’ పత్రికపై అయితే ఇవాంక లెక్కలేనన్నిసార్లు కనిపించారు. హిల్లరీకే కాదు, ఆ తర్వాత 2012లో అమెరికా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రామ్నీకి కూడా డబ్బు సహాయం చేశారు.
మొదటి ప్రపంచ యుద్ధం గవ్రిలో ప్రిన్సిన్ అనే బోస్నియా యువకుడి వల్ల ప్రారంభం అయింది. రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ వల్ల మొదలైంది. మూడో ప్రపంచ యుద్ధానికి ఇవాంక కారణం అవుతుందా పిచ్చి ఆలోచన. కానీ ఇవాంక ఇప్పుడు వైట్‌హౌస్‌లో తన తండ్రికి ఆంతరంగిక సలహాదారుగా ఉన్నారు కదా!! అదీ మంచికే అనుకోవాలి. ట్రంప్ తన కుమార్తె ఆదేశాలను పాటిస్తారేమో కానీ, ఇవాంక తన తండ్రిని గుడ్డిగా సమర్థించరు. ఆ విషయం మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే స్పష్టం అయింది. అదొక్కటే అమెరికా భద్రతకు ఇవాంకా బాధ్యత పడతారన్న నమ్మకాన్ని ఇస్తోంది.