బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (11:35 IST)

ఇండియన్ టెక్కీలకు డోనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. ఏంటది?

భారతీయ టెక్కీలకు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఓ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.

భారతీయ టెక్కీలకు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఓ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. దీంతో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఈ విధానం అనుకూలంగా మారనుంది. 
 
ఇప్పటివరకూ డైవర్సిటీ వీసా లాటరీ పేరుతో ఏటా 50 వేల మందికి వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వేల మంది భారతీయ వృత్తి నిపుణులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈనెల 25వ తేదీన ట్రంప్ సర్కార్ వలసల సంస్కరణలపై చట్టం తీసుకురావడానికి చేసిన నాలుగు ప్రతిపాదనలలో ఇది ఒకటి కావడం గమనార్హం. శ్వేతసౌధం తాజాగా రూపొందించిన ప్రతిపానకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేస్తే ఇది అమల్లోకి వచ్చినట్టే.