సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (11:02 IST)

పోర్న్‌స్టార్‌తో ట్రంప్ శారీరక సంబంధం.. అమెరికాలో కలకలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్‌.. పోర్న్ స్టార్‌తో సంబంధం కలిగివున్నట్లు ఆరోపణలు ఎద

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్‌.. పోర్న్ స్టార్‌తో సంబంధం కలిగివున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టకముందే ఓ పోర్న్ స్టార్‌తో ఆయనకు శారీరక సంబంధాలున్నట్లు తేలింది. ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకూడదని భారీ మొత్తంలో ట్రంప్ సొమ్ములు ముట్టజెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
 
వివరాల్లోకి వెళితే.. స్టిఫానీ క్లిఫార్డ్ అనే అమెరికా పోర్న్ స్టార్‌కు ట్రంప్‌కు 2006 నుంచి పరిచయం వుందని.. అదే సమయంలోనే మెలానియాను ట్రంప్ మూడో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ, స్టిఫానీతో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దిగుతున్న సమయంలో, ఈ విషయం గురించి స్టిఫానీ మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించింది. 
 
అయితే ఈమెకు భారీ మొత్తాన్ని మట్టుజెప్పి ట్రంప్ నోరుమూయించారు. ఇందులో భాగంగా ఏకంగా లక్షా ముప్పై వేల డాలర్లను ముట్టజెప్పి మ్యాటర్ క్లియర్ చేశారు ట్రంప్ లాయర్ మైఖేల్. విషయం బయటకు రానివ్వకుండా ఆమె వద్ద నుంచి హామీ కూడా తీసుకున్నారు. అయికే ఈ విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.
 
ఈ కథనాలను మైఖేల్ కొట్టిపారేయగా స్టిఫానీ మాత్రం స్పందించలేదు. వైట్ హౌస్ కూడా ఇవన్నీ కట్టుకథలంటోంది. అయినా ట్రంప్ పోర్న్‌స్టార్ సంబంధాలపై చర్చ మొదలైంది. ఈ వార్తలు అమెరికాలో కలకలం సృష్టించాయి.