ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (09:09 IST)

ట్రంప్ వీసా సవరణ ప్రమాణాల ప్రకారం తాతయ్య అమ్మమ్మలకు వీసా చెల్లదు

ముస్లిం దేశాలపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విధించిన నిషేధాన్ని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైపోయారు. అమెరికాకు ఆరు ముస్లిం దేశాల ప్రవేశాన్ని కష్టతరం చేస్తూ, విధించిన నిషేధానిక

ముస్లిం దేశాలపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విధించిన నిషేధాన్ని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైపోయారు. అమెరికాకు ఆరు ముస్లిం దేశాల ప్రవేశాన్ని కష్టతరం చేస్తూ, విధించిన నిషేధానికి న్యాయస్థానం దన్ను కూడా లభించిన నేపథ్యంలో, ఆ దేశాలకు సంబంధించి.. వీసా నిబంధనలను మరింతగా బిగించేసింది. 
 
ఈ వీసా సవరణ ప్రమాణాల ప్రకారం తాతయ్య అమ్మమ్మలను సొంత కుటుంబసభ్యులుగా పరిగణించరు. అమెరికాలోని తమవారి వద్దకు వెళ్లడానికి వారికి వీసా లభించదు. అమెరికాలోని వారితో తమకున్న బంధాన్ని నిరూపించుకొన్నవారికే ప్రవేశం ఉంటుంది. దగ్గర.. దూరపు బంధాలుగా వీరిని పరిగణించే విధంగా ఓ జాబితాను రూపొందించారు. ఆరు ముస్లిం దేశాలతోపాటు, అమెరికాలో ఆశ్రయం కోరుకునే శరణార్థులకు ఈ కొత్త నిబంధనని విధించారు.