గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:02 IST)

కాలిఫోర్నియాలో భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదు

కాలిఫోర్నియాలో భూకంపం కలకలం రేపింది. ఉత్తర కాలిఫోర్నియా తీరంలో 6.2 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల నేపథ్యంలో జనాలు జడుసుకున్నారు. అయితే సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. హంబోల్ట్ కౌంటీకి సమీపంలో ఉన్న కేప్ మెండోసినో వద్ద భూకంపం సంభవించినట్టు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. 
 
కాలిఫోర్నియాలో వచ్చిన భూ ప్రకంపనల ప్రభావం...శాన్ ఫ్రాన్సిస్కో వరకూ కన్పించిందని సమాచారం. గత 11 ఏళ్లలో ఇలాంటి భూకంపాన్ని ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ భూకంపానికి సంబంధించిన ప్రమాద నష్టం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.