శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (11:00 IST)

కేరళను ఆదుకునేందుకు సిద్ధం : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న కేరళ వాసులను ఆదుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ముందుకు వచ్చింది. కేరళీయులు త్వరగా కోలుకోవాలని తమ దేశ ప్రజలంతా త్వరగా కోలుకోవాలని దే

ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న కేరళ వాసులను ఆదుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ముందుకు వచ్చింది. కేరళీయులు త్వరగా కోలుకోవాలని తమ దేశ ప్రజలంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేరళ వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. కేరళకు తమవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పాకిస్థాన్ ప్రజల తరపున కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 
 
వరద బాధితులు త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అవసరమనుకుంటే తమవంతు మానవతా సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇమ్రాన్ తెలిపారు. 
 
అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేరళ కోసం ప్రకటించిన 700 కోట్ల రూపాయలను కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యూహాత్మకంగా సాయం చేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం.