ముళ్లై పెరియార్ డ్యామ్‌ను కూల్చేయమన్నాం.. తమిళనాడు పట్టించుకోలేదు..
కేరళ రాష్ట్రం వరదలో మునిగిపోవడంతో యావత్తు దేశం షాక్ తింది. ఇంకా కేరళకు ఇతర రాష్ట్రాలు చేయూతనిచ్చాయి. ఇందులో తమిళనాడు కూడా వుంది. అయితే కేరళ మాత్రం తమ రాష్ట్రంలో సంభవించిన వరదలకు తమిళనాడే కారణమని ఆరోపణ
కేరళ రాష్ట్రం వరదలో మునిగిపోవడంతో యావత్తు దేశం షాక్ తింది. ఇంకా కేరళకు ఇతర రాష్ట్రాలు చేయూతనిచ్చాయి. ఇందులో తమిళనాడు కూడా వుంది. అయితే కేరళ మాత్రం తమ రాష్ట్రంలో సంభవించిన వరదలకు తమిళనాడే కారణమని ఆరోపణలు చేస్తోంది.
తమ రాష్ట్రంలో వరదలపై కేరళ ప్రభుత్వం తమిళనాడును నిందించింది. తమ రాష్ట్రంలో ఉన్న ముళ్లై పెరియార్ ప్రాజెక్ట్ నుంచి నీటిని అకస్మాత్తుగా విడుదల చేయడం వల్ల తమ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని సుప్రీంకోర్టుకు తెలిపింది.
వరదలను నివారించడానికి ముళ్లై పెరియార్ డ్యామ్‌లో నీటి నిల్వ స్థాయిని 139 అడుగుల వరకు ఉంచాలని తాము విజ్ఞప్తి చేసినా తమిళనాడు పట్టించుకోలేదని తెలిపింది. ముళ్లై పెరియార్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని, ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో కేరళ అల్లకల్లోలంగా మారిందని కేరళ ప్రధాన కార్యదర్శి చెప్పారు.
తమిళనాడు ప్రజలకు నీటిని అందించే ముళ్లైపెరియార్ ప్రాజెక్టును కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ డ్యామ్ నిర్వహణ మొత్తం తమిళనాడే చూసుకుంటోంది. కానీ డ్యామ్ పాతది కావడంతో కూల్చివేయాలని కొత్త డ్యామ్ నిర్మించాలని.. చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నామని కేరళ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఈ డ్యామ్‌లో నీటిశాతం పెరగడంతోనే ఇడుక్కికి నీరు చేరాయని.. దీంతో భారీ వరదలు సంభవించాయని కేరళ ఆరోపించింది. ఫలితంగా 373 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.