1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (11:18 IST)

బోరున విలపిస్తూ ప్రసంగించిన బరాక్ ఒబామా.. అధ్యక్ష పదవికి వీడ్కోలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బోరున విలపించారు. ఆయన శ్వేతసౌథాధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం ఆయన అధ్యక్ష పదవికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉద్వి

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బోరున విలపించారు. ఆయన శ్వేతసౌథాధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం ఆయన అధ్యక్ష పదవికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరిత ప్రసంగం చేశారు. చివర్లో 'మేము చేయగలం.. మేము చేశాము' అని నినదించారు. భవిష్యత్తు అమెరికాదే అని స్పష్టం చేశారు.
 
తన సొంత పట్టణమైన చికాగోలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విలువల పతనం, జాతివివక్ష తదితర విషయాల్లో అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశ యువత, కృషి, వైవిధ్యం, పారదర్శకత, తెగింపు, పునఃసృష్టిస్తే భవిష్యత్తు మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జాతి వివక్షపై మరింత బలమైన చట్టాలు ఉండాలన్నారు. దీనిలో మన రాజ్యాంగం.. ఆదర్శాలు ప్రతిబింభించాలని ఆకాంక్షించారు. తనకు అమెరికాపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అమెరికన్లకు పునఃసృష్టి చేసే అచంచలమైన శక్తి ఉందన్నారు.
 
మనం భయాన్ని పెంచితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనల్ని ఈస్థాయికి తీసుకొచ్చిన విలువలకు పరిరక్షణగా ఉందాం.. అందుకే నేను ముస్లిం అమెరికన్లపై వివక్షను ఏ మాత్రం అంగీకరించను అని పేర్కొన్నారు. ఆసమయంలో అక్కడ ఉన్న వారంతా 'చివరిగా ఇంకొక్కసారి' అని కోరడంతో ఒబామా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.