బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (17:39 IST)

పాకిస్థాన్ మా దోస్త్.. మా బంధం తేనె కంటే తియ్యనైంది: చైనా ప్రకటన

పాకిస్థాన్‌తో చైనా సంబంధంపై చైనా పొలిట్‌బ్యూరో కమిటీలో సభ్యుడైన వాంగ్ అద్భుతంగా అభివర్ణించారు. పాకిస్థాన్‌తో తమ అనుబంధం స్టీల్ కంటే దృఢమైందని.. తేనె కంటే తియ్యనైందని అభివర్ణించారు. భారత్-పాకిస్థాన్ మధ

పాకిస్థాన్‌తో చైనా సంబంధంపై చైనా పొలిట్‌బ్యూరో కమిటీలో సభ్యుడైన వాంగ్ అద్భుతంగా అభివర్ణించారు. పాకిస్థాన్‌తో తమ అనుబంధం స్టీల్ కంటే దృఢమైందని.. తేనె కంటే తియ్యనైందని అభివర్ణించారు. భారత్-పాకిస్థాన్ మధ్య జమ్మూ కాశ్మీర్ సమస్య, భారత్-చైనాల మధ్య డోక్లాం సమస్య ఏర్పడిన నేపథ్యంలో.. పాకిస్థాన్‌తో తమ సంబంధాలు మరింత మెరుగుపడుతాయని వాంగ్ పేర్కొన్నారు.
 
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చైనాలోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకుల్లో ఒకరైన వాంగ్ మాట్లాడుతూ.. పాక్‌, చైనా ప‌ర‌స్ప‌రం సాయం చేసుకుంటున్నాయ‌ని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ అభివృద్ధికి చైనా సాయపడుతుందని, చైనా-పాకిస్థాన్‌ల మధ్య భారీ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్నట్లు తెలిపారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాకిస్థాన్‌ సర్కారుతో చేతులు కలిపి ముందుకు వెళ్తామని వాగ్ వెల్లడించారు.