1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (17:45 IST)

గ్యాంగ్ రేప్‌కు గురై నగ్నంగా వీధుల్లో తిరగాడింది.. సెలెబ్రిటీ అయిపోయింది.. ర్యాంప్ వాక్ చేసింది..

సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే ప్రస్తుతం సెలబ్రిటీ అయిపోయింది. 14 ఏళ్ల క్రితం గ్యాంగ్ రేప్‌కు గురై వీధుల్లో నగ్నంగా తిరగాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న ఆమె.. అనేక కష్టాలను అధిగమించి సెలెబ్రిటీగా మ

సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే ప్రస్తుతం సెలబ్రిటీ అయిపోయింది. 14 ఏళ్ల క్రితం గ్యాంగ్ రేప్‌కు గురై వీధుల్లో నగ్నంగా తిరగాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న ఆమె.. అనేక కష్టాలను అధిగమించి సెలెబ్రిటీగా మారిపోయింది. ఆమె పేరు ముక్తార్ మాయి. ఈమె ఎంతోమంది బాధితులకు ధైర్యాన్ని ఇస్తూ, స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. అంతేగాకుండా మహిళలకు సాయం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
2002వ సంవత్సరంలో మాయి సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని దారుణంగా అవమానించాడట. అయితే దీనికి బదులు గ్రామ గిరిజన పెద్దలు ముక్తార్ మాయిపై సామూహిక అత్యాచారం జరగాలని, ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని తీర్పు చెబుతూ కఠిన శిక్ష విధించారు. ఈ శిక్షను అనుభవించిన ముక్తార్ ఇతర బాధితురాళ్ళ మాదిరి కుంగిపోలేదు.
 
తనలో తాను ధైర్యం తెచ్చుకుంది. తనకు శిక్ష విధించిన పెద్దలమీదా, తనపై అత్యాచారానికి పాల్పడినవారిమీదా న్యాయపోరాటం చేసింది. ఏకంగా సుప్రీంకోర్టుకే ఎక్కింది. నిందితులందరిపైనా విచారణ జరిపిన కోర్టు.. ఆరుగురికి మరణశిక్ష విధించింది. అయితే వాళ్ళంతా అప్పీలు చేసుకున్నారు. ఆపై విడుదలైపోయారు. 
 
ఇక వాళ్లతో పోరాటం చేస్తే ప్రయోజనం ఏం లేదనుకున్న ముక్తార్ మహిళల హక్కులకోసం ఉద్యమించడం ప్రారంభించింది. తన మీర్ వాలా గ్రామీణ ప్రాంతంలో.. ఓ గర్ల్స్ స్కూలును, అనాథ మహిళల కోసం ఓ కేంద్రాన్ని ప్రారంభించింది. క్రమంగా ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. మంగళవారం కరాచీలో జరిగిన పాక్ ఫ్యాషన్ వీక్‌కు హాజరైన 44 ఏళ్ళ ఈమెను మోడల్స్ అంతా అభినందించారు. అన్యాయం జరిగితే ఆశలు వదులుకోవద్దని, ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుందని భావించాలని పేర్కొంది. ఈ సందర్భంగా ముక్తార్ ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది.