కన్సాస్ ఘటన.. ట్రంప్ పాలసీలతో తలనొప్పే.. న్యూయార్క్ టైమ్స్
కన్సాస్ ఘటనపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీపై వ్యాఖ్యానించింది. ట్రంప్ పాలనలో అమెరికాలో విద్వేష నేరాలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు మాత్రం ఇచ్చింది. హెచ్1బీ వీసాల జా
కన్సాస్ ఘటనపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీపై వ్యాఖ్యానించింది. ట్రంప్ పాలనలో అమెరికాలో విద్వేష నేరాలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు మాత్రం ఇచ్చింది. హెచ్1బీ వీసాల జారీ విధానంపై ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని న్యూయార్క్ టైమ్స్‌లో కథనాలుగా రాశారు. హెచ్1బీ వీసాలతో వేలాది మంది భారత ఐటీ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవనే విధంగా న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది.
ఈ వీసాల జారీ విధానాన్ని కఠినతరం చేస్తారని వార్తలు రావడంతో భారత్‌లో ఆందోళన మొదలైందని తెలిపారు. భారతీయ యువత అమెరికాలో చదవాలని, ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారని.. శ్రీనివాస్ దాడిని ఖండించడం లేదా సమర్థించడం కూడా ట్రంప్ చేయలేదని న్యూయార్క్ టైమ్స్ ఊటంకించింది.
మిగిలిన పత్రికల్లో శ్రీనివాస్‌పై కాల్పులకు సంబంధించి.. కాస్త వివరంగా ప్రస్తావించారు. అయితే కొన్ని పత్రికలు ప్రాథమిక వివరాలతో సరిపెట్టుకున్నాయి. వాషింగ్టన్ పోస్టులో అలోక్ మాడసాని తండ్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా ప్రచురించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికాకు పంపించవద్దని కోరిన విషయాన్ని హైలైట్ చేసింది.