సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (17:15 IST)

అతను కాలేయం దానమిస్తే.. ఆమె హృదయం ఇచ్చి సొంతం చేసుకుంది!

కాలేయ సంబంధం రెండు హృదయాలను కలిపింది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ యువ‌తికి త‌న‌ కాలేయంలోని కొంత భాగాన్ని ఓ యువ‌కుడు దానం చేశాడు. అనంతరం త‌న‌కు కాలేయ భాగాన్ని దానం చేసిన వ్య‌క్తినే ఆ యువ‌తి ప్రేమించి

కాలేయ సంబంధం రెండు హృదయాలను కలిపింది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ యువ‌తికి త‌న‌ కాలేయంలోని కొంత భాగాన్ని ఓ యువ‌కుడు దానం చేశాడు. అనంతరం త‌న‌కు కాలేయ భాగాన్ని దానం చేసిన వ్య‌క్తినే ఆ యువ‌తి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... అమెరికాలోని ఇల్లినాయిస్‌కి చెందిన ఫ్రాన్స్‌కోర్ట్‌లో ఉండే హెదర్‌ క్రూగర్ అనే యువ‌తికి రెండేళ్ల క్రితం తన కాలేయం పాడైపోయింది. దాతలు ఎవరైనా కాలేయం దానమిస్తేనే ఆమె బతుకుతుందని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దీంతో ఆమె దాతల కోసం వెతుకులాట ప్రారంభించింది. కానీ ఆమెకు కాలేయం దానం చేయడానికి దాతలెవరూ ముందుకు రాక‌పోవ‌డంతో ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంది. 
 
ఈ స‌మయంలో ఆమె గురించి క్రిస్‌ డింప్సే అనే వ్య‌క్తికి తెలిసింది. కాలేయం దానం చేసి ఆమెకు సాయ‌ప‌డ‌తాన‌ని ముందుకు వచ్చాడు. వైద్యులు అత‌డికి అన్ని పరీక్షలు చేసి కాలేయం హెదర్‌కి సరిపోతుందని చెప్పారు. గ‌త ఏడాది మార్చిలో శ‌స్త్ర‌చికిత్స‌ చేసి ఆ యువ‌కుడి కాలేయంలో కొంతభాగాన్ని స‌ద‌రు యువ‌తికి అమర్చారు. ఈ నేప‌థ్యంలోనే క్రిప్స్‌, క్రిస్ మ‌ధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 
 
దీంతో వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకొని భార్యాభ‌ర్త‌లై వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా క్రిస్‌ మాట్లాడుతూ... తాను హెదర్‌ పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఆమె స్థితిలో త‌న‌ కుటుంబ సభ్యులే ఉన్నట్లుగా భావించాన‌ని చెప్పాడు. అందుకే ఆమెతో పరిచయం లేకున్నా కాలేయం ఇచ్చాన‌ని పేర్కొన్నాడు. అనంతరం హెద‌ర్ మాట్లాడుతూ... త‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కు క్రిస్ ఒక‌ గొప్ప వ్యక్తి అని...త‌న మీద నమ్మకాన్ని ఉంచాడని పేర్కొంది. ఇప్పుడు తాను నవ్వుతూ అంద‌రి మ‌ధ్య‌లో తిరుగుతున్నానని చెప్పింది.