శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (09:50 IST)

'పాక్‌కు వీసాలు నిలిపేయాలని ట్రంప్‌ను ప్రార్థిస్తున్నా' : ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ వీసాలు తక్షణం నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రార్థిస్తున్నట్టు పాకిస్థాన్ తెహ్రిక్-ఈ-ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

పాకిస్థాన్ వీసాలు తక్షణం నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రార్థిస్తున్నట్టు పాకిస్థాన్ తెహ్రిక్-ఈ-ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌పై కూడా నిషేధం విధించాలని కోరుకుంటున్నానని, పాక్‌కు ట్రంప్ వీసాలు నిలిపేయాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కనీసం అలా అయినా పాక్‌ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 
 
ఏడు ముస్లింల దేశాల నుంచి అమెరికాకు ఎవరూ రాకుండా అడ్డుకుంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ఇవ్వడంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో న్యూయార్క్‌కు వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి డెమొక్రటిక్ నేత హిల్లరీ క్లింటన్ మద్దతు తెలిపారు. 
 
న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్టు ఎదుట భారీ ఆందోళలు చేపట్టారు. 2 వేల మందకిపైగా గుమికూడారు. లాస్ ఎంజెలెస్ నుంచి న్యూజెర్సీ వరకు అన్ని విమానాశ్రయాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ముస్లింలు, మైనార్టీలపై ట్రంప్ కక్ష కట్టారంటూ ఆందోళనకారులు మండిపడ్డారు. మరోవైపు ట్రంప్ హాయాంలో తమకు రక్షణ ఉండబోదని మహిళలు సయితం ఆందోళనలో పాల్గొంటున్నారు.