మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (14:45 IST)

భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష.. 5001 కువైట్ దినార్లు పరిహారం!

భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. ఓ హత్య కేసులో ఇరుక్కున్న అతనికి మరణశిక్ష విధించడంతో పాటు బాధితుడి కుటుంబానికి 5001 కువైటీ దినార్లను నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. ఓ హత్య కేసులో ఇరుక్కున్న అతనికి మరణశిక్ష విధించడంతో పాటు బాధితుడి కుటుంబానికి  5001 కువైటీ దినార్లను నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 3వేల కేడీల రుణం విషయంలో ఓ ఆప్ఘన్, భారత వలసదారుల మధ్య చోటుచేసుకున్న వివాదం కాస్త ముదిరింది.
 
ఎంతసేపటికీ ఈ వివాదం ముగియకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారతీయుడు ఆప్ఘన్ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం పరారైన అతడిని స్పాన్సర్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాక బాధితుడి వారసులకు 5001 కేడీలు ఇవ్వాలని ఆదేశించింది.