బుధవారం, 20 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (22:21 IST)

పాకిస్తాన్ పురుషులు వర్సెస్ భారతీయ పురుషులు... పాక్ యువతి షాకింగ్ కామెంట్స్(Video)

పాకిస్తాన్ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు..? ఇప్పటికే ఆ దేశంలో తలదాచుకుని భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉన్న ఉగ్రవాదులను తుదముట్టించాలని అంటున్నారు. అంతేకాదు... పాకిస్తాన్ దేశంలో జరిగిన ఓ రియాల్టీ షోలో

పాకిస్తాన్ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు..? ఇప్పటికే ఆ దేశంలో తలదాచుకుని భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉన్న ఉగ్రవాదులను తుదముట్టించాలని అంటున్నారు. అంతేకాదు... పాకిస్తాన్ దేశంలో జరిగిన ఓ రియాల్టీ షోలో భారతీయ పురుషుల గురించి ఓ యువతి చేసిన కామెంట్లు ఇప్పుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. 
 
'సబ్ సే హిమ్మత్ వాలా' అనే ఆ షోలో పాల్గొన్న ఆ యువతిని షో వ్యాఖ్యాత ప్రశ్నిస్తూ... ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన పురుషులు అందరికంటే ఉత్తమమైన వారని భావిస్తున్నారు" అని ప్రశ్నించగా ఆమె ఎంతమాత్రం తడుముకోకుండా భారతీయ పరుషులు అందరికంటే ఉత్తమమైన వారని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. దీనితో వ్యాఖ్యాతకు కోపం నషాలనికి అంటింది. 
 
దానితో మళ్లీ తిరిగి మరో ప్రశ్న సంధించాడు. భారతీయ పురుషులు ఉత్తములని ఎందుకంటున్నారని అడుగగా... "విమానమెక్కే పాకిస్థానీలు పెద్దతాగుబోతుల"నీ, అలా తాగేసిన తరువాత వారు చేసే హంగామా అంతాఇంతా కాదని చెప్పింది. విమానం తమదే అన్నట్లు ప్రవర్తిస్తారనీ, అసభ్యంగా చిందులేస్తారంటూ విమర్శించింది. మరి భారతీయ పురుషులు తాగరా అని ప్రశ్నిస్తే... వారు తాగినా ఎవరి సీట్లలో వారు నిద్రపోతారనీ, హుందాగా ప్రవర్తిస్తారని ఆమె వెల్లడించింది. ఆ యువతి మాట్లాడిన వీడియోను మీరు కూడా చూడండి.