సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (10:22 IST)

డాన్ టీవీ తెరపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

భారత్ అంటేనే పాకిస్థాన్ పాలకులు లేదా ప్రజలు లేదా ఉగ్రవాదులు పగతో రగిలిపోతుంటారు. అలాంటిది ఆ దేశానికి చెందిన ప్రముఖ టీవీ చానెల్ తెరపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆ పతాకం కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ అనే సందేశం వచ్చింది. 
 
ఇంతకీ ఇలా చేసింది ఆ టీవీ చానెల్ యాజమాన్యం కాదు. హ్యాకర్లు. పాకిస్థాన్ ప్రముఖ టీవీ చానెళ్ళలో ఒకటి డాన్. ఈ టీవీని హ్యాకర్లు హ్యాక్ చేశాడు. ఫలితంగా భారత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా 'హ్యాపీ ఇండిపెండెన్స్ డే' (స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు) అనే సందేశాన్ని కూడా జత చేశారు.
 
పాకిస్థాన్ కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు డాన్‌ న్యూస్ ఛానల్‌లో భారత జెండా ఎగిరినట్లు సమాచారం. అయితే దీని మీద డాన్ న్యూస్ చానల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది.