శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 16 జులై 2020 (22:00 IST)

హెచ్ -1బి వీసాకు వ్యతిరేకంగా భారతీయులు పిటిషన్

హెచ్1-బి వీసాకు వ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కొలంబియా కోర్టులో దాఖలైన ఈ పిటిషన్లో కొత్త హెచ్ 1-బి నియమాలు కుటుంబాలను వేరు చేస్తుందని తెలిపారు. ఈ కారణంగా కొంతమందికి వీసా లభించకపోవడంతో వారు అమెరికా రాలేకపోయారని పేర్కొన్నారు.
 
ఈ కేసులో సమాధానం చెప్పడానికి కొలంబియా జిల్లా కోర్టు బుధవారం విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ మరియు యాక్టింగ్ హోంల్యాండ్ సెక్యురిటీ ఛీప్ మరియు కార్మిక కార్యదర్శికి సమన్లు పంపింది. 174 మంది భారతీయులు తమ న్యాయవాది వాస్టెన్ బెనియాస్ తరపున ఈ కేసు దాఖలు చేసారు.
 
హెచ్1-బి, హెచ్-4 వీసాలపై నిషేధం అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తుందని పేర్కొంది. ఇది కుటుంబాలను వేరుచేస్తుందని, అలాగే ఇది పార్లమెంటు ఆదేశాలకు కూడా వ్యతిరేకమని పేర్కొంది. హెచ్1-బి, హెచ్-4కు సంబంధించిన కొత్త ఆర్డర్లను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అదనంగా ఈ వీసాలకు సంబంధించిన పెండింగ్ కేసులన్నింటిని ముగించాలని విదేశాంగ శాఖను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.