ఐఎస్ తీవ్రవాదిని పట్టుకుని బుల్‌డోజర్‌కు కట్టి ఈడ్చుకెళ్ళారు?
సిరియాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఐసిస్ ఉగ్రవాదుల పని పట్టేందుకు సిరియా సైనిక దళాలు నడుం బిగించాయి. ఐసిస్‌లో ఛోపింగ్ కమిటీ అనే దళ నాయకుడిగా చెలరేగుతున్న జిహాదీని పట్టుకుని అతని చేతులను వెనక్కి విరిచి తాడుతో కట్టి... బుల్‌డోజర్ వెనుకభాగంలో పడేసి తీసుకుపోయారు. జలపట్ల అతికిరాతరంగా ప్రవర్తించే మానవ మృగాన్ని సైనికులు గొడ్డును ఈడ్చినట్టు ఈడ్చుకెళ్లడంతో స్థానికుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇకపోతే సిరియా, ఇరాక్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులపై సైనికభద్రతాదళాలు నిఘా పెంచుతున్నాయి. తమ బందీలను అతిక్రూరంగా హతమారుస్తున్న జిహాదీలు ఇటీవలి కాలంలో అమాయక ప్రజలపై పన్నుల భారం మోపి వారికి నరకయాతన చూపిస్తున్నారు. దీంతో ఇరాక్, సిరియా ప్రభుత్వాలు ఉగ్రవాదులను అణచివేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాయి.