సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (10:56 IST)

ఇంగ్లండ్‌పై భీకర దాడులతో విరుచుకుపడతాం : ఐసిస్

ఇంగ్లండ్‌పై భీకరదాడులతో విరుచుకుపడతామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఐసిస్ హెచ్చరించింది. అలాగే, ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నరమేథం సృష్టించింది తామేనని ఆ సంస్థ ప్రకటించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని

ఇంగ్లండ్‌పై భీకరదాడులతో విరుచుకుపడతామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఐసిస్ హెచ్చరించింది. అలాగే, ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నరమేథం సృష్టించింది తామేనని ఆ సంస్థ ప్రకటించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని... భీకరమైన దాడులు ముందున్నాయని హెచ్చరించింది. 
 
మాంచెస్టర్‌లోని మాంచెస్టర్ ఎరీనా వద్ద శక్తిమంతమైన బాంబు పేలడంతో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడ్డారు. దీనిపై ఇసిస్ ఓ ప్రకటన చేసింది. మోసుల్‌లో దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేశామంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. పైగా, ఈ దాడులు విజయవంతం కావడంతో ఇసిస్ తీవ్రవాదులతో పాటు సానుభూతిపరులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 
 
కాగా, మాంచెస్టర్ దాడితో యూరోప్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. జనం ఎక్కువగా ఉండే చోట తనఖీలను ముమ్మరం చేశాయి. అమెరికా కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. మాంచెస్టర్ ఎరీనా మృతులకు బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 
కాగా, ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ ఎరీనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న సమయంలో భారీ ఎత్తున గుమిగూడి ఉన్న సంగీత ప్రియులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలైనట్టు బ్రిటన్‌ మీడియా అధికారికంగా వెల్లడించింది.