ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ విజేతా భారత్ బుడతడు... రికార్డు సృష్టించాడు
ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ పోటీల్లో భారత్‌కు చెందిన పన్నెండేళ్ల ప్రశాంత్ రంగనాథన్ విజేతగా నిలిచాడు. ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ పోటీలో... పురుగుమందుల జీవ విచ్ఛిన్నశీలత (బయోడ
ఈ ఇంటర్నేషనల్ ఫెయిర్‌ను అమెరికాలో ఇంటెల్ సంస్థ నిర్వహించింది. ‘ఇంటెల్ అంతర్జాతీయ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్’ పేరుతో నిర్వహించిన పోటీలో భారతదేశం నుంచి 20 పాఠశాలల విద్యార్థులు సహా ప్రపంచవ్యాప్తంగా 1700 మంది పాల్గొన్నారు. వీరిలో జంషెడ్‌పూర్‌కు చెందిన ప్రశాంత్ చివరకు విజేతగా ఎంపికయ్యాడు.
భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న పురుగుమందుల సమస్యను స్థానిక బ్యాక్టీరియాతో పరిష్కరించడానికి తన ప్రాజెక్టు ఉపకరిస్తుందని ఆ విద్యార్థి పేర్కొన్నాడు. సులువుగా భూమిలో కలిసిపోయేలా పురుగుమందుల్ని మార్చడం వల్ల అనేక దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చని పేర్కొన్నాడు. ఇంటెల్ పోటీలో అత్యున్నతమైన గార్డన్ ఇ మూరే పురస్కారం జర్మనీకి చెందిన ఇవోజెల్‌కు (75 వేల డాలర్లు) దక్కింది.
నలుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉన్నతస్థాయి పురస్కారాలు పొందారు. శుక్రవారం సాయంత్రం లాస్‌ఏంజిలెస్‌లో జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతీ విభాగంలోనూ భారతీయ విద్యార్థులు గట్టి పోటీనిచ్చారు. మొత్తం మీద భారత్ నుంచి వచ్చిన, భారతీయ అమెరికన్లు కలిపి అగ్రశ్రేణి విభాగాల్లో అయిదో వంతు పురస్కారాలు సాధించారు.