గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (10:18 IST)

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భార్యకు ఏమైంది..? 7నెలలుగా మిస్.. కిమ్ చెల్లెలు ఏమైనా చేసిందా?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భోజన ప్రియుడు అని తెలిసిందే. వైన్, చీజ్ లేకుంటే ఆయనకు రాత్రిపూట ముద్ద దిగదని.. అలాగే అమ్మాయిల చుట్టూ పెట్టుకుని డిన్నర్ చేయడం ఆయన అలవాటని ఆయన వద్ద చెఫ్‌గా పనిచేసిన వ్యక్త

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భోజన ప్రియుడు అని తెలిసిందే. వైన్, చీజ్ లేకుంటే ఆయనకు రాత్రిపూట ముద్ద దిగదని.. అలాగే అమ్మాయిల చుట్టూ పెట్టుకుని డిన్నర్  చేయడం ఆయన అలవాటని ఆయన వద్ద చెఫ్‌గా పనిచేసిన వ్యక్తి వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మొదటి మహిళ, అధ్యక్షడు కిమ్ భార్య రిసోల్-జు దాదాపు 7 నెలలుగా బాహ్యప్రపంచానికి కనపడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రిసోల్ మీడియా కంటపడి దాదాపు ఏడు నెలలు కావడంతో.. ఆమె ఏమైంది..? ఎక్కడుంది? అనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2009లో వీరిద్దరి వివాహం జరిగింది. అనంతరం ఓ వారసుడికి కూడా రిసోల్ జన్మనిచ్చింది. చివరిసారిగా మార్చి నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కనిపించారు. భర్త కిమ్ లేదా అతని సోదరి 'కిమ్ యో జోంగ్' నుంచి రిసోల్‌కు ఏదో హాని జరిగి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కిమ్ సోదరి కిమ్ కంటే కనికరంలేని మనిషని స్థానిక మీడియా చెబుతోంది. 
 
కిమ్ భార్య రిసోల్ ప్రతీ రెండు నెలలకు ఓసారి బయట ప్రపంచానికి కనిపిస్తారని.. అలాంటిది.. ఏడు నెలలైనా మీడియా కంటపడకపోవడం దారుణమని.. ఆమెకు ఏదో హానీ జరిగివుంటుందని స్థానిక మీడియాలో వార్తలొస్తున్నాయి.