శుక్రవారం, 31 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2025 (13:32 IST)

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

gold reserves
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కౌలికోరో ప్రాంతంలో బుధవారం బంగారు గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. గనిలో తవ్వకాలు జరుపుతుండగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలలే ఉండటం గమనార్హం. ఈ ప్రమాదంలో మరికొందరు గల్లంతయ్యారు. 
 
గనిలో బురుద నీరు ప్రవేశించి కార్మికులను చుట్టుముట్టడంతోపాటు కొందరు శిథిలాల కింద చిక్కుకునిపోయారని గవర్నర్  కల్నల్ లామైన్ కపోరీ సనొగో వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాగా, గత యేడాది జనవరి నెలలో కూడా ఇదే ప్రాంతంలోని కంకబా జిల్లాలో బంగారు గని కూలిపోయిన ఘటనలో 70 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.