గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (09:02 IST)

సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన నోబెల్ పీస్ ప్రైజ్ మలాలా!

పాకిస్థాన్ యువతి మలాలా యూసుఫ్ జాయ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అస్సర్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ వేడుకలు నిరాడంబరంగా జరిగిగాయి. బర్మింగ్‌హామ్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అస్సర్‌ అనే యువకుడిని నిఖా చేసుకున్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. 
 
ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వాలా ప్రపంచానికి తెలిపింది. "ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములమయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మాకు మీ ఆశీస్సులు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం" అని ట్విటర్‌లో పోస్టు చేశారు. తన నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలను అందులో ఉంచారు.