ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (17:01 IST)

మెక్సికో బాణసంచా మార్కెట్‌‌లో భారీ పేలుడు.. 29 మంది దుర్మరణం..

మెక్సికోలో చోటుచేసుకున్న భారీ బాణసంచా మార్కెట్ పేలుడు ఘటనలో 29 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 70మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను సహాయ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మెక్సికోలోని టుల్‌టుపెక

మెక్సికోలో చోటుచేసుకున్న భారీ బాణసంచా మార్కెట్ పేలుడు ఘటనలో 29 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 70మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను సహాయ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మెక్సికోలోని టుల్‌టుపెక్ బాణాసంచా మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా మెక్సికోలోని టుల్‌టుపెక్‌లో భారీ మొత్తంలో బాణాసంచా తయారు చేస్తున్నారు.
 
బాణాసంచా తయారీ కోసం భారీగా గన్ పౌడర్‌ను నిలువ చేస్తారు. ఇదే ప్రస్తుతం ప్రమాదానికి కారణమైంది. గన్ పౌడర్‌కు అగ్గి రాజుకోవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మార్కెట్ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుడు ధాటికి పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు రోడ్డుపైకి పరుగులు తీశారు. మంటలను అదుపు చేసిన సహాయక సిబ్బంది.. గాయపడిన వ ారికి ఆస్పత్రికి తరలించారు.