శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (10:43 IST)

మెక్సికోలో మారణ హోమం - మేయర్ సహా 21 మంది మృతి

థాయ్‌లాండ్‌లో చైల్డ్ కేర్ సెంటరుపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల ఘటన జరిగి 24 గంటలు గడచిపోకముందే మెక్సికో నగరంలో మరో మారణహోమం జరిగింది.

ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మేయర్ సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయాడు. మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో మేయర్, ఆయన తండ్రితో పాటు మొత్తం 21 మంది మృత్యువాతపడ్డారు. 
 
అలాగే, మెక్సిలో జరిగిన మరో ఘటనలో చట్టసభ్యురాలిని కూడా కాల్చి చంపారు. మెక్సికోలోని శాన్ మిగేల్ టోటోలాపన పట్టణంలో మేయర్ కొన్రాడో మెనండోజా అల్మెడా అధ్యక్షత నగర కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా, ఓ దండగుడు సమావేశ మందిరంలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో మేయర్, మాజీ మేయర్ అయిన ఆయన తండ్రి సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందిన వెంటనే ఆర్మీతో పాటు నేవీ రంగంలోకి దిగింది.