శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (05:31 IST)

డోనాల్డ్ ట్రంప్ చాలా మంచోడు.. ఆందోళన అక్కర్లేదు : సత్య నాదెళ్ల

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడం పట్ల అటు స్వదేశీయంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం భయాందోళనలు నెలకొన్నాయి. స్వయంగా అమెరికా పౌరులే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అధ్యక్షుడిగా

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడం పట్ల అటు స్వదేశీయంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం భయాందోళనలు నెలకొన్నాయి. స్వయంగా అమెరికా పౌరులే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ వద్దనే వద్దంటూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికవ్వడం పట్ల తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. మైక్రోసాఫ్ట్‌ స్థానం ఉద్యోగాలు కల్పించేదిగానే ఉంటుందనే నమ్మకం ఉందన్నారు. అమెరికా ప్రధాన కేంద్రంగా నడిచే తమ సంస్థ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయని, ఎక్కువ భాగం ఉద్యోగులు అమెరికాలోనే ఉన్నారని గుర్తు చేశారు. 
 
మ్యునిచ్‌లో జరిగిన డిజిటల్‌ లైఫ్‌ డిజైన్‌ టెక్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము ఇప్పటికే అమెరికాలో ఉద్యోగులకు అధిక వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,13,000 మందికి పైగా ఉద్యోగులు ఉండగా.. వారిలో 64 వేల మంది అమెరికాలో ముఖ్యంగా వాషింగ్టన్‌లో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అవ్వడం వల్ల మైక్రోసాఫ్ట్‌ ప్రణాళికల్లో పెద్దగా తేడా ఏమీ ఉండబోదని నాదెళ్ల స్పష్టంచేశారు.