1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (10:49 IST)

బహిరంగంగా ముద్దులు పెట్టుకుని.. కౌగిలించుకున్నారు.. అరెస్టయ్యారు.. మూడేళ్లు జైలు?

బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు.. కౌగిలించుకున్నారు.. అయితే వారిద్దరూ ఆడా మగా కాదు. ఇద్దరూ బాలికలే. మొరాకోలో ఇద్దరు బాలికలను స్వలింగ సంపర్కం నేరం కింద అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిక

బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు.. కౌగిలించుకున్నారు.. అయితే వారిద్దరూ ఆడా మగా కాదు. ఇద్దరూ బాలికలే. మొరాకోలో ఇద్దరు బాలికలను స్వలింగ సంపర్కం నేరం కింద అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరికీ మూడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశముంది. వీరిద్దరినీ గతవారం మర్రాకెచ్‌లో అరెస్ట్ చేశారు. బహిరంగంగా అసహజ సెక్స్‌కు పాల్పడ్డారని వారిని అరెస్ట్ చేశారు. అయితే వారిద్దరూ ప్రస్తుతం బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. 
 
మొరాకో చట్టం 489 సెక్షన్ ప్రకారం కోర్టులో విచారణ జరగనుంది. 489 సెక్షన్ ప్రకారం... స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తారు. స్వలింగ సంపర్కులు అసభ్యంగా, అసహజంగా ప్రవర్తిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.
 
కాగా, బాలికల తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించినట్టు మొరాకో మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒమర్ అర్బీబ్ తెలిపారు. 489 సెక్షన్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదని పేర్కొన్నారు.