చెమట కంపు కొడుతోందనీ... ముస్లిం జంటను కిందికి దింపేసిన డెల్టా ఎయిర్ లైన్స్
చెమట కంపు కొడుతోందనీ ఓ ముస్లిం జంటను డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది కిందికి దింపేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
చెమట కంపు కొడుతోందనీ ఓ ముస్లిం జంటను డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది కిందికి దింపేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన నాజియా, ఫైసల్ అలీ తమ పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విహారయాత్రకు వెళ్లారు.
పారిస్‌కు నుంచి సిన్సినాటికి రావడానికి డెల్టా విమానం ఎక్కారు. నాజియా తన చెప్పులు విప్పి సీటులో కూర్చున్నారు. పక్కనే ఆమె భర్త ఉన్నారు. ఇంతలో విమాన సిబ్బంది ఒకరు వారిపై పైలట్‌కు ఫిర్యాదు చేశారు. ఫైసల్ చెమటలు కక్కుతున్నాడని, అతనితో వచ్చిన నాజియా తలకు స్కార్ఫ్ కట్టుకుని సెల్‌ఫోన్ పట్టుకున్నదని, వారివల్ల తమకు ఎంతో అసౌకర్యంగా ఉన్నదంటూ ఫిర్యాదు చేశారు.
తనను చూడగానే అతను ఫోన్ దాచేందుకు ప్రయత్నించాడని, వారు అల్లా అనడం తాను విన్నానని ఫ్లయిట్ అటెండెంట్ కూడా చెప్పాడు. దాంతో పైలట్ గ్రౌడ్ కంట్రోల్ సిబ్బందితో మాట్లాడి ఆ జంటను విమానం నుంచి దించేశారు. కిందికి దిగాక వారిని ఫ్రెంచ్ పోలీస్ ఆఫీసర్ యక్ష ప్రశ్నలు వేశాడు. గత నెల 26న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.