నేపాల్: టేకాఫ్ అవుతున్న విమానం కూలిపోయింది.. 18మంది మృతి (video)  
                                       
                  
                  				  నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
				  											
																													
									  టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. కాట్మండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్ సీఆర్జే 200 విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి.
				  
	 
	ఈ ప్రమాదం సమయంలో విమాన సిబ్బందితో సహా 19మంది వుండగా.. 18మంది ప్రాణాలు విడిచారు. పైలట్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.