ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (12:24 IST)

నేపాల్ అమ్మాయిని పెళ్లాడిన పెనుమూరు అబ్బాయి...

penamuru - nepal girl marriage
నాలుగేళ్లుగా నేపాల్ అమ్మాయితో ప్రేమలో మునిగితేలుతున్న పెనుమూరు అబ్బాయి ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. పెద్దలను ఒప్పించి నేపాల్ అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. లండన్‌లో ఉద్యోగం చేస్తూ వచ్చిన పెనుమూరు అబ్బాయి భువన్ కృష్ణ... అదేకంపెనీలో పనిచేసే నేపాల్ అమ్మాయి మనీలను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం గురువారం తెల్లవారుజామున చిత్తూరు జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామానికి చెందిన భువన్ కృష్ణ... లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను పనిచేసే కంపెనీలోనే పనిచేసే నేపాల్ అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకుని, తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాహానికి వారు తొలుత సమ్మతించకపోయినప్పటికీ ఆ తర్వాత వారిని ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. దీంతో వీరిద్దరి వివాహం గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా ఓ హోటల్‌లో జరిగింది.