బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (10:06 IST)

ఓటమి భయంతో వణికిపోతున్న సీఎం జగన్‌!! వైకాపా జాబితాలకు బ్రేక్!!

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో అధికార వైకాపాకు ఓటమి భయంపట్టుకుంది. రాష్ట్రంలోని ప్రతి వర్గం ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయితే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే, ప్రజల్లోనూ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ఉంది. దీనికితోడు అనేక స్థానాల్లో సిట్టింగ్‌లకు సీటు ఇవ్వకుండా కొత్త వారికి జగన్ అవకాశం కల్పిస్తున్నారు. దీంతో అనేక మంది కీలక నేతలు పార్టీని వీడి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరిపోతున్నారు. ఈ సంఖ్య గత కొన్ని రోజులుగా ఎక్కువైంది. దీంతో వైకాపా అభ్యర్థుల జాబితాను ఇకపై విడుదల చేయరాదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. 
 
సర్వేల సాకుతో చాలా మంది సిటింగ్‌లకు ఆయన టికెట్లు నిరాకరించడంతో వారిలో పెద్దఎత్తున అలజడి చెలరేగడం, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల్లో చేరిపోతుండటం వంటి అనేక పరిణామాలతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా లోక్‌సభ పరిధిలో కొందరు అభ్యర్థులను మార్చాలని.. ఇంకొందరిని కొనసాగించాలని ఎంపీలు ఒత్తిడి చేస్తున్నప్పటికీ సీఎం జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
దీంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు టీడీపీలో చేరి పోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటిదాకా ఆరు జాబితాలు విడుదల చేయగా.. వాటిలో 68 అసెంబ్లీ స్థానాలకు, 14 లోక్‌సభ సీట్లకు ఇన్‌ఛార్జులను నియమించారు. వీరిలో 42 మంది సిట్టింగులకు మొండి చేయి చూపించారు. వారం రోజులుగా ఏడో జాబితా విడుదల చేస్తామంటున్నా ఇవ్వలేదు. ఈలోపు సీనియర్ నేతల జంపింగ్ వార్తలతో ఇక ఒకేసారి జాబితా విడుదల చేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.