బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (16:06 IST)

న్యూజిలాండ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల మావోరి డ్యాన్స్‌ వైరల్‌.. (video)

Maori MP Hana-Rawhiti Maipi-Clarke
Maori MP Hana-Rawhiti Maipi-Clarke
న్యూజిలాండ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. ట్రీటీ ప్రిన్సిప‌ల్స్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో వినూత్న నిర‌స‌న తెలిపారు ప్ర‌తిప‌క్ష ఎంపీలు. బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి క‌రేరికి మైపి క్లార్క్.. ఆమెను అనుస‌రించారు మ‌రికొంద‌రు ఎంపీలు. బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి క‌రేరితో మ‌రికొంద‌రు ఎంపీలు సైతం అనుస‌రించారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా ఉన్నారు.. హనా రాహితి. ఆమె వయసు 22 సంవత్సరాలు. పార్లమెంట్‌లో వివాదాస్పద ట్రీటీ ప్రిన్సిపుల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసన చేపట్టారు. 
New Zealand Parliament
New Zealand Parliament
 
ఈ బిల్లును రెండు ముక్కలుగా చించేశారు. ఆ తర్వాత మావోరి సంప్రదాయ నృత్యం చేశారు. గట్టిగా ఓ పాట పాడుతూ... డ్యాన్స్ చేస్తూ తన స్థానం నుంచి పోడియం దిశగా వస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకటిన్నర నిమిషాల ఈ వీడియోను కెల్విన్ మోర్గాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.