గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (16:20 IST)

నైజీరియాలో చర్చ్ కూలిన ఘటనలో 160 మంది మృతి.. ఐరన్ రాడ్ల కింద వందలాది మంది?

నైజీరియాలోని ''ది రెయినర్స్ బైబిల్ చర్చ్'' కుప్పకూలిన ఘటనలో 160మంది మృతి చెందారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పా

నైజీరియాలోని ''ది రెయినర్స్ బైబిల్ చర్చ్'' కుప్పకూలిన ఘటనలో 160మంది మృతి చెందారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పాల్గొన్నారు. ఐరన్ రాడ్లు, సిమెంటు, రాళ్ళ క్రింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
మరోవైపు కెన్యాలోని పెద్ద ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి పోయింది. ఈ ప్రమాదంలో 33మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన నాకురు-నైరోబీ రోడ్డులో రాత్రి 9.30గంటలకు సంభవించినట్లు తెలిపారు.
 
వేగంగా వెళుతున్న ట్యాంకర్‌పై నియంత్రణ కోల్పోవడంతో కెరాయ్‌ ప్రాంతంలోని ఇతర వాహనాలపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటనలో పేలుడు సంభవించి అనూహ్యంగా పలువురు మృత్యువాత పడినట్లు తెలిపారు.