1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (09:28 IST)

సైనిక బలగాల పొరపాటు.. వంద మంది శరణార్థుల బలి.. బోకో హరాం టెర్రరిస్టులపై దాడి..

నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద

నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద మందికిపైగా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటు, శిబిరంలో వైద్యం సహా అనేక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు సైతం మృతి చెందారు. 
 
రన్‌లోని తీవ్రవాద శిబిరాలు లక్ష్యంగా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే తమ వైపు నుంచి పెద్ద పొరపాటు జరిగిపోయిందని మిలిటరీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ధ్రువీకరించారు. ఈశాన్య నైజీరియాలోని రన్‌ నగరం చాన్నాళ్లుగా బోకో హరాం తీవ్రవాదుల గుప్పిట్లో ఉంది. ఈ నగరంపై సైనిక చర్యకు దిగిన నైజీరియా బలగాలు మంగళవారం పెద్దఎత్తున వైమానిక దాడులు జరిపాయి.