గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (12:09 IST)

దూడను మింగేసిందని పామును చంపేశారు.. కానీ పాము కడుపులో ఏమున్నాయో తెలుసా?

నైజీరియాకు చెందిన ఓ గ్రామ వాసులు పొట్ట నిండ గుడ్లతో కూడిన పెద్దపామును పొట్టనబెట్టుకున్నారు. దూడను మింగేసిందనే కోపంతో పశ్చిమాఫ్రికాలోని నైజేరియాలో ఓ గ్రామ వాసులకు నిండైన పొట్టతో ఉన్న భారీ పామును చంపేశా

నైజీరియాకు చెందిన ఓ గ్రామ వాసులు పొట్ట నిండ గుడ్లతో కూడిన పెద్దపామును పొట్టనబెట్టుకున్నారు. దూడను మింగేసిందనే కోపంతో పశ్చిమాఫ్రికాలోని నైజేరియాలో ఓ గ్రామ వాసులకు నిండైన పొట్టతో ఉన్న భారీ పామును చంపేశారు.
 
పాము భారీగా ఉండటం.. దాని పొట్ట కాస్తా పెద్దగా ఉండటంతో తమ దూడను అది తినిందోమో అని వారికి అనుమానం వచ్చింది. అంతే దాని పొట్టలో ఏముందో చూడాలని పామును చంపి, పొట్ట కోసి చూశారు. కానీ, ఆ భారీ పాము కడుపులో దూడ లేదు. ఆ పాము నిండు గర్భంతో ఉంది. 
 
అందులో పొదగడానికి సిద్ధంగా ఉన్న డజన్ల కొద్ది గుడ్లు తప్ప ఏమీ లేవు. అది ఏ జాతి పామో స్పష్టంగా తెలియక పోయినా, దాని ఆకారాన్ని బట్టి అది ఆఫ్రికా రాక్‌ పైతాన్‌ అని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చనిపోయిన పాము పట్ల నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భారీ పాము కనిపించగానే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాల్సిందిపోయి ఇలా దాని పొట్టలో ఏముందో తెలుసుకోవాలని చంపేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.