శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (14:30 IST)

మరో అణు పరీక్షకు సిద్ధం.. అమెరికాకు ఉ.కొరియా హెచ్చరిక

అగ్రదేశం అమెరికాను ఉత్తర కొరియా మారోమారు రెచ్చగొట్టింది. మరో అణు పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించి తన దూకుడుకు అడ్డుకట్ట లేదని చెప్పకనే చెప్పింది. ఇప్ప‌టికే ఎన్నో అణ్వాయుధ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అ

అగ్రదేశం అమెరికాను ఉత్తర కొరియా మారోమారు రెచ్చగొట్టింది. మరో అణు పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించి తన దూకుడుకు అడ్డుకట్ట లేదని చెప్పకనే చెప్పింది. ఇప్ప‌టికే ఎన్నో అణ్వాయుధ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అల‌జ‌డి రేపిన ఉత్తర కొరియా తాజాగా మ‌రో అణు ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. 
 
తాము ఏ క్షణంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ పరీక్ష నిర్వహిస్తామని క‌ల‌క‌లం రేపింది. త‌మ దేశం నుంచి సుదూర ప్రాంతాలను ఢీ కొట్టగలిగే సామర్థ్యమున్న క్షిపణిని ప్రయోగించ‌నున్న‌ట్లు ఉత్త‌ర‌ కొరియా స్ప‌ష్టం చేసింది.
 
అయితే, ఈ దఫా అణ్వాయుధ పరీక్షలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని, ఒకవేళ ఆ చ‌ర్య‌కు పాల్ప‌డితే సైనిక దాడులకు దిగాల్సి ఉంటుందని ఉత్త‌ర‌కొరియాను అమెరికా హెచ్చరించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ అమెరికాకు స‌వాలు చేస్తూనే ఉత్త‌ర‌కొరియా ఇటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌డంతో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.