సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (10:50 IST)

పీవోకేలో మరో 12 ఉగ్ర శిబిరాలు.. ఒక్కో శిబిరానికి 40 మంది పాక్ ఆర్మీ: అజిత్ ధోవల్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఒక్కో ఉగ్రవాద శిబిరానికి 40 మంది సాయుధ ఆర్మీ జవాన్లు రక్షణగా ఉన్నట్టు చెప్పారు. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసిన తెల్సిందే. దీంతో పాకిస్థాన్ గుర్రుగా ఉంది. ప్రతి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ ఆరా తీసింది. 
 
ఈ శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ ర‌క్ష‌ణ కల్పిస్తున్నట్లు స‌మాచారం. కేంద్ర‌మంత్రి వ‌ర్గ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ఒక్కో ఉగ్ర శిబిరానికి దాదాపు 40 నుంచి 50 మంది పాక్ జ‌వాన్లు రక్షణగా ఉన్నట్లు ఆయ‌న ప్ర‌ధానికి వివ‌రించారు.