శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2016 (11:14 IST)

డొనాల్డ్ ట్రంప్‌కు ఒబామా వార్నింగ్.. నువ్వు ఎంత స్మార్ట్ అనేది ముఖ్యం కాదు

అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇతర ఏజెన్సీల పట్ల అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ మంచి సంబంధాలతో ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించారు. అమెరికా నిఘా సంస‍్థ సీఐఏ, ఇతర ఏ

అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇతర ఏజెన్సీల పట్ల అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ మంచి సంబంధాలతో ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించారు.

అమెరికా నిఘా సంస‍్థ సీఐఏ, ఇతర ఏజెన్సీల విషయంలో ట్రంప్‌ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని, అది ప్రమాదకరమైన ధోరణి అని ఒబామా వార్నింగ్ ఇచ్చారు. 'నువ్వు ఎంత స్మార్ట్‌ అనేది ముఖ్యం కాదు. ఒక మంచి నిర‍్ణయం తీసుకోవాలంటే.. దానికి సంబంధించిన బెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ను మనం పరిశీలించాలి' అని ఒబామా అన్నారు.
 
డెమోక్రటిక్‌ పార్టీని, ముఖ్యంగా హిల్లరీని లక్ష్యంగా చేసుకొని జరిగిన సైబర్‌ దాడులలో రష్యా పాత్ర ఉందంటూ ఇటీవల సీఐఏ అందించిన రిపోర్ట్‌ను ట్రంప్‌ తోసిపుచ్చారు. ఇరాక్‌ విషయంలోనూ ఏజెన్సీల పనితీరు సరిగా లేదని ట్రంప్‌ మండిపడ్డారు. దీంతో ట్రంప్‌ అనుసరిస్తున్న 'ఫ్లయింగ్‌ బ్లైండ్‌' విధానం ప్రమాదకరమైనదని ఒబామా హెచ్చరించారు.