శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (19:10 IST)

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

chiranjeevi, anjanadevi
chiranjeevi, anjanadevi
మెగా స్టార్ చిరంజీవి అమ్మ అంజనా దేవి ఆరోగ్యం పై వస్తున్న కథనాలపై మెగా స్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు. గత రెండు రోజులుగా ఆమె అనారోగ్యంగా ఉందని తెలిసింది. దానితో సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దాని పై చిరు ఇలా తెలిపారు. మా అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలపై నా దృష్టిని ఆకర్షించింది. రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని స్పష్టం చేయాలన్నారు. ఆమె హుషారుగా, ఇప్పుడు సంపూర్ణంగా ఉంది. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి. మీ అవగాహనను మార్చుకోండి అన్నారు.
 
నిన్ననే చిరు వివాహ వేడుకను విమానంలో సన్నిహుతులతో జరుపుకున్నారు. ఇక  ఈ విషయం తెలిసి పవన్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.