శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2017 (14:13 IST)

క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించి.. రేప్ చేసిన ఓహియో మహిళ... పక్కనే స్నేహితుడు

సాధారణంగా క్యాబ్‌ డ్రైవర్లు తమ కార్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వార్తలు మనం చదువుతుంటాం. కానీ, అమెరికాలోని ఓహియో పట్టణంలో ఓ మహిళ... క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో బెదిర

సాధారణంగా క్యాబ్‌ డ్రైవర్లు తమ కార్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వార్తలు మనం చదువుతుంటాం. కానీ, అమెరికాలోని ఓహియో పట్టణంలో ఓ మహిళ... క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తాను ప్రయాణిస్తోన్న క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించి అతడిపై ఓ యువతి అత్యాచారం చేసింది. అంతేకాదు అతడి దగ్గర డబ్బులు కూడా లూటీ చేసింది. పోలీసులనే అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటన అమెరికాలోని ఓహియోలో చోటుచేసుకుంది. 
 
ఓహియోకు చెందిన 23 ఏళ్ల బ్రిట్టనీ కార్టర్ అనే యువతి తన స్నేహితుడు కోరీ జాక్సన్‌తో కలసి ఓ ట్యాక్సీ ఎక్కింది. ట్యాక్సీ సిటీ ఆఫ్ ఫిండ్లే‌కు చేరుకోగానే డ్రైవర్‌పై ఇద్దరూ కలిసి దాడి చేశారు. అతడి గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అనంతరం ట్యాక్సీ డ్రైవర్‌పై బ్రిటనీ కార్టర్ అత్యాచారానికి పాల్పడింది.
 
తర్వాత 32 డాలర్లును దోచుకుని అంతటి ఆగకుండా మరోసారి అతనిపై అత్యాచారం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన జనవరి 28న జరిగింది. ట్రినిటీ ఎక్స్‌ప్రెస్ క్యాబ్ సర్వీస్‌లో జనవరి 28 ప్రయాణించిన బ్రిట్టనీ ఆ ట్యాక్సీ డ్రైవర్‌పై అత్యాచారానికి పాల్పడింది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరెస్ట్ తర్వాత ఆమెను హన్కాక్ కంట్రీ జైలుకు తరలించగా, ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.38 లక్షల చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది.