ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (18:54 IST)

గర్భస్రావాలు చేసే వైద్యుడి ఇంట.. 2వేలకు పైగా పిండాలు..

అబార్షన్లు చేసే ఓ వైద్యుడి ఇంట రెండు వేలకు పైగా మెడికల్ పరంగా భద్రపరిచిన పిండాలను పోలీసులు గుర్తించడం అమెరికాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉల్‌రిచ్ క్లోప్‌ఫెర్ అనే వైద్యుడు ఈ నెల మూడో తేదీన మరణించాడు. 
 
ఇండియానాలోని సౌత్​బెండ్​లో ఒక అబార్షన్​ క్లీనిక్​లో ఆయన సుదీర్ఘ కాలంగా డాక్టర్​గా పనిచేశాడు. పేషెంట్ల రిజిస్టర్​ను సరిగ్గా మెయింటైన్​ చేయకపోవడం మెడికల్​ అబార్షన్​ పాలసీలను ఉల్లఘించడం వంటి వాటికి సంబంధించి ఈ క్లీనిక్​పై ఇండియానా స్టేట్​ డిపార్ట్​మెంట్​ఆఫ్ హెల్త్​కు అనేక కంప్లయింట్లు అందాయి. 
 
అబార్షన్​కు ముందు 18 గంటల పాటు పేషెంట్లకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన కౌన్సిలింగ్​ను ఇవ్వడం లేదని మెడికల్​ ఏజెన్సీలు గుర్తించాయి. దీంతో 2015లో ఈ హాస్పిటల్​ లైసెన్స్​ను అధికారులు రద్దు చేశారు. ఇండియానాలో అతి ఎక్కువ అబార్షన్లు చేసిన డాక్టర్​గా క్లోప్ ఫెర్​‌కు పేరుంది. నాలుగు దశాబ్దాలుగా చాలా క్లీనిక్స్​లో అతడు వేలాది ఆపరేషన్లు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో గత వారం కోప్​ఫెర్​ మరణించిన తర్వాత అతడి ఇంట్లో పిండాలను గుర్తించిన ఫ్యామిలీ మెంబర్లు షెరీఫ్ ఆఫీసుకు సమాచారం అందించారు. పిండాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని ఇంట్లో ఎలాంటి మెడికల్​ ప్రొసీజర్​ నిర్వహించిన ఆధారాలు లేవన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.