ఇక పాకిస్థాన్ పని మటాష్... డోనాల్డ్ ట్రంప్ నిషేధిత దేశాల జాబితాలో పాక్?
ఇకపై పాకిస్థాన్ పని మటాష్ కానుందా? అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పాకిస్థాన్ పని అయిపోయినట్టేనని వారు అంటున్నారు. ముఖ్యంగా.. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నిషేధిత దేశాల జాబితా
ఇకపై పాకిస్థాన్ పని మటాష్ కానుందా? అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పాకిస్థాన్ పని అయిపోయినట్టేనని వారు అంటున్నారు. ముఖ్యంగా.. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్ ఉంటే మాత్రం ఆ దేశం పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోకి ప్రవేశం నిషేధించిన దేశాల జాబితాలోకి పాక్ కూడా చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రెనిక్ ప్రైబస్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఏడు ముస్లిం ఆధిక్య దేశాలకు చెందిన శరణార్థులు అమెరికాలో ఆశ్రయం పొందకుండా.. వలస రాకుండా.. పౌరసత్వం పొందకుండా ఈ చట్టం నిషేధిస్తుంది.
దీనిని పాకిస్థాన్‌కు కూడా వర్తింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గతంలో అమెరికా కాంగ్రెస్, ఒబామా ప్రభుత్వం కూడా అంగీకరించాయి. పాకిస్థాన్‌లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఆయా దేశాలకు వెళ్లి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్‌లకు వెళ్లిన వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని చెప్పారు.